ప్రమాదానికి గురైన తిరుమలకుంట సర్పంచ్ 

నవతెలంగాణ – అశ్వారావుపేట

ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు పడి తీవ్ర గాయాలు పాలైన సర్పంచ్. మండల పరిధిలోని తిరుమలకుంట సర్పంచ్ సున్నం సరస్వతి, భర్త సున్నం రామ లక్ష్మయ్య లు మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఎంపీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి హాజరు అయ్యారు. అశ్వారావుపేట నుండి తిరుమలకుంట వెళ్ళే క్రమంలో అశ్వారావుపేట – ఊట్లపల్లి మధ్యలో  కదులుతున్న ద్విచక్రవాహనం పై నుండి జారిపడి పోయారు. ఈ ప్రమాదంలో సరస్వతికి తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఇక్కడ ప్రాధమిక చికిత్స అనంతరం వైద్యులు కొత్తగూడెం ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలు అయినట్లు ఆర్.ఎం.ఓ డాక్టర్ క్రిష్ణ కాంత్ తెలిపారు.
Spread the love