ఈవీఎంలపై అవగాహన కల్పిస్తున్న సర్పంచ్ రామగిరి లావణ్య 

– ఈవీఎంలపై అవగాహన సదస్సు 
నవ తెలంగాణ-రామగిరి 
రామగిరి మండలంలోనీ ముస్త్యాల గ్రామంలో గ్రామ సర్పంచ్ రామగిరి లావణ్య-నాగరాజు అధ్వర్వంలో ఈవిఎం మిషన్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ లావణ్య మాట్లాడుతూ, 18 సంవత్సరాలు దాటిన వారు ఓటు వేసే సమయంలో ఈవీఎంలో ఓటు ఎలా వేయాలో వివరించారు. అలాగే గ్రామంలోని బీసీ వాడలో బోరు మోటారు చెడిపోయి విషయం సర్పంచ్ కి తెలుపగానే వెంటనే స్పందించి మరమ్మతులు చేయించారు. ఈకార్యక్రమంలో ఏఈఓ అరవింద్, శ్రీనివాస్, పిసి సమ్మయ్య, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love