
నవతెలంగాణ – డిచ్ పల్లి
గత ఐదేళ్లుగా గ్రామ అభివృద్ది కి చేసిన సేవలను వెలకట్టలేనిదని, సర్పంచుల పదవి కాలం లో ఎన్నో అటు పోట్లను ఎదురుకుంటు ముందుకు సాగారని ఎంపీపీ గద్దె భూమన్న (శ్రీనివాస్), ఎంపిడిఓ టీవీఎస్ గోపి బాబు అన్నారు. బుదవారం డిచ్ పల్లి మండల పరిధిలోని 34 గ్రామపంచాయతీల్లోని సర్పంచులకు మండల పరిషత్ సమావేశ మందిరంలో సర్పంచులకు మండల పరిషత్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలోఎంపీపీ గద్దె భూమన్న మాట్లాడుతూ.. సర్పంచుల పదవి కాలం ముగియడంతో పెండింగ్ బిల్లులు రాక అయోమయంలో ఉన్నారని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ల పదవి కాలాన్ని ఐదు సంవత్సరములు పూర్తి కావడంతో ప్రత్యేక పాలన అధికారులు నియమించి గ్రామాలలో పరిపాలన కొనసాగించనున్నారని వివరించారు. కరోనా మహమ్మారి కాలంలో రెండు సంవత్సరాలు సర్పంచ్లకు చాలా ఇబ్బందులకు గురై బిల్లులు రాక ఆందోళన చెందుతునే ప్రభుత్వ ఆదేశాలను అమలు చేసినట్లు ఎంపిడిఓ టీవీఎస్ గోపి బాబు అన్నారు.ఐదు సంవత్సరాలు పరిపాలన కొనసాగించాల్సి ఉండగా రెండు సంవత్సరాల కాలం కరోనా కష్టకాలంతోనే సరిపోయిందని మిగతా సంవత్సరాలు మాత్రమే పదవిలో కొనసాగారని అన్నారు.. సర్పంచ్ల పదవీకాలంలో గ్రామాల అభివృద్ధికి మండల పరిషత్ అభివృద్ధి అధికారి నిధులు అందించారని ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూశారని గ్రామాల సర్పంచులు అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.. ప్రతి గ్రామ సర్పంచ్ ట్రాక్టర్ల కనుగోలుకు ఇతర అభివృద్ధి పనులకు 50 శాతం పైగా సొంత నిధులు బాకీలు తెచ్చి గ్రామాలను అభివృద్ధి చేశారని వెంటనే బకాయి నిధులను ప్రభుత్వం అందించి ఆదుకోవాలని పలువురు సర్పంచులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీ నివాస్, సర్పంచ్ల సమాఖ్య మండల అధ్యక్షులు మోహన్ రెడ్డి, ఏఈ శ్రీధర్ బాబు సర్పంచులు పాల్గొన్నారు.