కాంగ్రెస్ పార్టీలో చేరిన సత్తూరి నాగరాజు

నవతెలంగాణ – రాయపర్తి
బీఆర్ఎస్ వి మండల అధ్యక్షుడు, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ సత్తూరి నాగరాజు పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఝాన్సీ రెడ్డి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నాగరాజుకు వారు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజా పాలన వర్ధిల్లుతుందన్నారు. పెద్దలు ఝాన్సీ రెడ్డి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చేపడుతున్న సేవా కార్యక్రమాలతో ప్రజలకు లబ్ధి చేకూరడంతో పాటు యువతకు అనేక ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయన్నారు. పార్టీలో ముఖ్య నాయకుల సలహా సూచనల మేరకు పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తా అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ అధ్యక్షులు ఆమ్యా నాయక్ , రాయపర్తి మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి, మండల నాయకులు నర్సన్న, శేఖర్, మద్దెల వెంకటేష్, గంగ లక్ష్మి, బద్దం పులిందర్ రెడ్డి, యూత్ అధ్యక్షుడు కందుకూరి కృష్ణ, వడ్డెపెల్లి సోమేశ్వర్, లాక్య నాయక్, జితేందర్, ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Spread the love