సావిత్రిబాయి జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలి

– తొలగించబడిన 26 బీసీ కులాల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ రామకృష్ణ
నవతెలంగాణ-హిమాయత్‌ నగర్‌
సావిత్రిబాయి ఫూలే జయంతిని ఉపాధ్యాయ దినోత్స వంగా ప్రకటించాలని తొలగించబడిన 26 బీసీ కులాల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ రామకృష్ణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. మంగళ వారం బషీర్‌ బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సావిత్రిభాయి పూలే ఫౌండేషన్‌, ఎంబీసీ, డీఎన్‌టీ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం 1 గంటలకు నిర్వహించే సావిత్రిభాయి పూలే 193వ జయంతి ఉత్సవాలు, సావిత్రిబాయి పూలే అంతర్జా తీయ ఐకాన్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాలకు సంబంధించిన వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆళ్ళ రామకష్ణ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే ఉపాధ్యాయురాలు మాత్రమే కాదని, ఆమె రచయిత్రి, కవయిత్రి, సామాజిక కార్యకర్తగా కుల, మత, లింగ బేధాలు లేకుండా సమాజంలోని మహిళలు, బడుగు బలహీన వర్గాల బాగు కోసం శక్తివంచన లేకుండా ఎంతో కృషి చేశారని కొనియాడారు. సావిత్రిబాయి పూలే పేరుపై పురస్కారం, ప్రత్యేక మహిళా సంక్షేమం, విద్య, వైద్య, ఆర్థిక రంగాల్లో మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రజలందరూ ఘనంగా నిర్వహించాలని కోరారు. సావిత్రిభాయి పూలే జయంతి ఉత్సవాలను, సావిత్రిభాయి పూలే అంతర్జాతీయ ఐకాన్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాలను బుధవారం మధ్యాహ్నం 1 గంటకు రవీంద్రభారతిలో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, బీర్ల ఐలయ్య, ఆత్మీయ ముఖ్య అతిథుల ుగా శాసన సభ్యులు దానం నాగేందర్‌, పాయల్‌ శంకర్‌, రాజాసింగ్‌, గంగుల కమలాకర్‌ తదితరులు పాల్గొంటారని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో సావిత్రిభాయి పూలే ఫౌండేషన్‌ సీఈఓ పరమేశ్వరి, బోయ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు మీనగ గోపీ, తెలంగాణ ఆరెకటిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి.సురేందర్‌, బేడ బుడగ హక్కుల సాధన సమితి అధ్యక్షులు గగనం వెంకటస్వామి, అక్షర నేస్తం తెలుగు దినపత్రిక ఎడిటర్‌ తిపిరిశెట్టి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love