ఎస్బీఐ రుణాలు చౌక

SBI loans are cheap– వడ్డీ రేట్ల తగ్గింపు
ముంబయి : దేశంలోనే అతిపెద్ద దిగ్గజ విత్త సంస్థ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) తన రుణ గ్రహీతలకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించింది. సవరించిన రేట్లు ఏప్రిల్‌ 15 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇటీవల ఆర్‌బిఐ రెపో రేటును పావు శాతం తగ్గించిన నేపథ్యంలో దిగ్గజ బ్యాంక్‌ ఆ ప్రతిఫలాలను ఖాతాదారులకు బదిలీ చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే రెపో లింక్డ్‌ లెండింగ్‌ రేటు (ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌), ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌ మార్క్‌ ఆధారిత లెండింగ్‌ రేట్‌ను 25 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గించింది. రెపో లింక్డ్‌ రేటు 8.25 శాతానికి చేర్చగా.. ఇబిఎల్‌ఆర్‌ను 8.65 శాతానికి పరిమితం చేసింది. దీంతో ఇప్పటికే రుణాలు తీసుకున్న వారితో పాటు, కొత్తగా రుణాలు తీసుకునే వారికీ ప్రయోజనం చేకూరనుంది.

Spread the love