మొయినాబాద్ అరణ్య ఫామ్ హౌస్ కు
తీసుకెళ్లిన పోలీసులు
అక్కడే భగీరథ్ విచారణ
అనంతరం పేట్ బషీరాబాద్ పీఎస్ కు తరలింపు
నవతెలంగాణ – మొయినాబాద్
లైంగికదాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కేసులో పోలీసులు బుధవారం సీన్ రీకన్ స్ట్రక్షన్ చేశారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని అరణ్య ఫామ్ హౌజ్ కు భగీరథ్ ను తీసుకెళ్లారు. అక్కడే కొద్ది సేపు విచారించారు. అనంతరం మళ్లీ పేట్ బషీరాబాద్ పీఎస్ కు తరలించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..బాలికపై లైంగికదాడి కేసులో బండి భగీరథ్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. భగీరథ్ ను మూడ్రోజుల పోలీసు కస్టడీకి ఇస్తూ మల్కాజ్‌గిరి కోర్టు తీర్పు వెల్లడించింది. బుధవారం ఉదయం భగీరథ్ ను జైలు నుంచి పోలీసులు భారీ భద్రత మధ్య మేడ్చల్ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మొయినాబాద్ లోని ఫామ్ హౌజ్ కు తరలించారు. అక్కడ అతన్ని పలు ప్రశ్నలు అడిగి, కేసుకు సంబంధించిన కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం చేశారు. బాలిక, ఆమె తల్లి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు భగీరథ్‌పై ప్రశ్నలు సంధించారు. ఘటన ఎక్కడెక్కడ జరిగింది? ఎవరెవరు సహకరించారు? అనే కోణంలో విచారించారు. ఈ దర్యాప్తు మొత్తం కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగింది. విచారణ అనంతరం భగీరథ్ ను పీఎస్ కు తరలించారు.
బండి భగీరథ్ కేసులో సీన్ రీకన్ స్ట్రక్షన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



