నవతెలంగాణ-హైదరాబాద్: కర్నాటకలో సీఎం కుర్చీ మార్పుపై విస్తృతంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో నేటితో సదురు అంశంపై స్పష్టత రానుంది. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఆదేశాలకు అనుగుణంగా సిద్దరామయ్య సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారని సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం గవర్నర్ అప్పాయింట్‌మెంట్ కోరింది. ఈ క్రమంలో గురువారం ఉదయం అల్పాహార విందుకు రావాలని సీఎం సిద్దరామయ్య మంగళవారం రాత్రి మంత్రులకు ఆహ్వానం పంపారు. మంత్రులతోపాటు సీఎంకు ఆప్తులైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈ విందుకు హాజరకానున్నారు. నెహ్రూ వర్ధంతిలో బుధవారం పాల్గొన్న సీఎం సిద్దరామయ్య, రాజకీయాలతోపాటు అన్ని విషయాల గురించి గురువారం మాట్లాడతానన్నారు.
సీఎం పదవికి సిద్దరామయ్య రాజీనామా..?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



