Thursday, May 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పద్మాజి వాడిలో బడిబాట

పద్మాజి వాడిలో బడిబాట

- Advertisement -

నవతెలంగాణ – సదాశివనగర్ : మండలంలోని పద్మా జి వాడి  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో గురువారం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక భాగంగా బడిబాట కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పదవ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాల ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా విద్యను బోధిస్తున్నామని తెలిపారు. మా పాఠశాలలో మధ్యాహ్న భోజనం ,ఉచిత యూనిఫామ్, ఉచిత నోట్ పుస్తకాలు, డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు.

సర్పంచ్ లోకోటి సుబ్బారావు మాట్లాడుతూ మన పిల్లలను మన ప్రభుత్వ పాఠశా లోనే చదివిద్దామని గ్రామస్తులకు సూచించారు.  అంగన్వాడీ డ్వాక్రా సంఘం మహిళలతో సమావేశం నిర్వహించి పాఠశాల గురించి సంఘం మహిళలకు తెలిపారు. ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ గత సంవత్సరం పద్మా జీవాడి పాఠశాల నుండి త్రిబుల్ ఐటీ కి ముగ్గురు విద్యార్థులు ఎంపికైనట్టు తెలిపారు. ఈ సంవత్సరం కూడా త్రిబుల్ ఐటీ కి ఎంపిక అయితారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు రాజు, ఉపాధ్యాయ బృందం ,మహిళా సంఘాలు, అంగన్వాడి టీచర్లు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -