మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని సిట్టింగ్ స్కాడ్,ప్లయింగ్ స్కాడ్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. పరీక్ష కేంద్రంలో ఏర్పాట్లపై,పరీక్షలు ప్రశాంతంగా జరగడంపై సంతోషం వ్యక్తం చేసి సెంటర్ ఇంచార్జిని అభినందించారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రం ఇంచార్జి, డిఈసి మెంబర్ విజయదేవి మాట్లాడారు పరీక్ష కేంద్రానికి వంద మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ విధించారని, పరీక్ష ప్రదేశంలో ఎలాంటి అవంచనియా సంఘటనలు జరగకుండా కొయ్యుర్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని తెలిపారు. మూడవరోజు 129 మంది విద్యార్థులకు 114 మంది హాజరై 14 మంది విద్యార్థులు గైహాజరైయ్యారని తెలిపారు.