సీజనల్ వ్యాధులపై అప్రమత్తత అవసరం: డాక్టర్ రంజిత్..

నవతెలంగాణ – తాడ్వాయి
దేవుడు తర్వాత దేవుడు అని చాలామంది చేత పిలిపించుకునే వాడు ఎవరైనా ఉన్నారా అంటే అది వైద్యుడు. తమ వైద్య నైపుణ్యంతో వైద్యులు ఎంతో మందికి ప్రాణాలు ఇస్తారు, మరి ఎంతో మందికి పునర్జన్మను ప్రసాదిస్తారు. తమ సేవాస్ఫూర్తితో ప్రజలను ఆయురారోగ్యాలతో నిలుపుతారు. వానకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం అధికంగా ఉన్నందున తమ శాఖా పరంగా అప్రమత్తంగా ఉన్నామని మండలంలోని కాటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి రంజిత్ అన్నారు. ప్రజలు కూడా వ్యక్తిగతంగా శుభ్రత పాటించాలన్నారు.
నవతెలంగాణ తో కాటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రంజిత్ తో వానకాలంలో సీజన్ వ్యాధి వ్యాపించే అవకాశం అధికంగా ఉన్నందున తమ శాఖ పరంగా, ప్రభుత్వ పరంగా అప్రమత్తంగా ఉందామని కాటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రంజిత్ అన్నారు. ప్రజలు కూడా వ్యక్తిగతంగా శుభ్రత పాటించాలన్నారు. సీజనల్ వ్యాధులు నేపథ్యంలో నవతెలంగాణ ఇంటర్వ్యూలో పలు అంశాలు వివరించారు.
నవతెలంగాణ ప్రతినిధి: సీజన్ వ్యాధులు వ్యాపించకుండా శాఖ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
డాక్టర్: దోమలతో డెంగీ మలేరియా చికున్ గన్యా, ఫైలేరియా, జికా వైరస్, మెదడు బాబు తదితర వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. కాటాపూర్ పిహెచ్సి పరిధిలో తక్షణ స్పందన బృందాలను ఏర్పాటు చేశాం, నిరంతరం 24 గంటలు అందుబాటులో ఉండి దోమల నివారణ నిల్వనీటిలో సంతానోత్పత్తి నివారణకు మందుల పిచికారి చేస్తాం అన్నారు. స్థానిక సంస్థల అధికారులను, గ్రామపంచాయతీ సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. ప్రతి శుక్రవారం డ్రైడే నిర్వహిస్తున్నాం. ఎవరికివారు తమ ఇంటి ఆవరణ పరిసరాల్లో వర్షం నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. కొబ్బరి చిప్పలు ఇనుప డబ్బాలు పలిగిన పూలకుండల్లో నీలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.
నవతెలంగాణ ప్రతినిధి: కాటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో డెంగీ, మలేరియా కేసులు నమోదు అయ్యాయా ? వాటిపై మీ చర్యలు ఏమిటి ?
డాక్టర్: కాటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో డెంగీ మలేరియా కేసులు ఎక్కువగా నమోదు కాలేదు. ఎక్కడున్నావ్ ఒక కేసు నమోదు అయితే అక్కడ మెరుగైన చికిత్సలు అందించాం. నేపథ్యంలో పరిధిలోని ఆశా కార్యకర్తలతో ఇంటింటా జ్వరం సర్వే చేపట్టాం. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు గమనించిన వెంటనే వైద్యం అందిస్తున్నాం. అవసరమైన వారికి రక్త పరీక్షలు నిర్వహించి వైద్య చిచ్చులు అందిస్తాం. కొన్ని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాం.
నవతెలంగాణ ప్రతినిధి: సీజనల్ వ్యాధులకు పీహెచ్సీలు, పల్లె దావకానల సన్నద్ధత ఏమిటి?
డాక్టర్: పూర్తిస్థాయి సన్నదంగా ఉన్నాయి. అన్ని రకాల మందులు నిల్వలు ఉన్నాయి. మలేరియా డెంగీ తదితర వ్యాధుల నిర్ధారణకు సంబంధించిన కిట్లు అందుబాటులో ఉంచాం. దోమల నివారణకు పిచికారి ద్రావణాలు అందుబాటులో ఉన్నాయి.
నవతెలంగాణ ప్రతినిధి: గురుకుల పాఠశాల వసతి గృహాల్లో విద్యార్థుల సీజనల్ వ్యాధుల కాలంలో అనారోగ్యానికి గురవుతుంటారు, మీ పరంగా చర్యలేమిటి?
డాక్టర్: గురుకులాలు, హాస్టల్లో, పాఠశాలలో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తాం. ఇందుకోసం ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తున్నాం. ఈనెల మొదటి వారంలో క్యాంపులు ప్రారంభిస్తాం అవసరమైతే రక్త పరీక్షలు చేస్తాం. అంతేకాకుండా ఆకుకూరలు శుభ్రంగా ఉండేవి కొనుక్కోవాలి. వీళ్ళతో బాగా కడుక్కోవాలి. చేతుల శుభ్రత అతి ముఖ్యం. ఇంటి పర్సనల్ లో దోమల ఉత్పత్తికి కాకుండా నిల్వ నీరు ఉండనీయొద్దు. ఉదయం సాయంత్రం దూల ఉధృతి అధికంగా ఉంటుంది ఆ ఇంట్లోకి చొరపడకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలి.
Spread the love