అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ రైస్ స్వాధీనం

నవతెలంగాణ – రాయపోల్
నిరుపేద ప్రజలు కడుపునిండా మూడు పూటలా అన్నం తినాలని సదుద్దేశంతో ప్రభుత్వం ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీ చేస్తే కొంతమంది అక్రమార్కులు వ్యాపారం చేస్తున్నారని రాయపోల్ ఎస్సై విక్కుర్తి రఘుపతి అన్నారు. మంగళవారం రాత్రి అంకిరెడ్డిపల్లి, వడ్డేపల్లి గ్రామాలలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల పరిధిలో వాహనాల తనిఖీలలో భాగంగా వాహనాలు తనిఖీ చేపడుతుండగా 1)పుట్టగూడెం గ్రామం, రాజాపేట మండలం, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మదావత్ నామ్ తన అశోక్ లేలాండ్ TA 07 UL 2656 వాహనంలో 38 క్వింటాళ్ల రేషన్ బియ్యం.2) గ్రామము పుట్టగూడెం, మండలం రాజాపేట్ యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మానవత్ నితిన్.3) భూక్య రమేష్ నెంబర్ లేని టాటా ఏసీ వాహనంలో 28 క్వింటాళ్ల రేషన్ బియ్యం.4) తుర్కపల్లి గ్రామం తుర్కపల్లి మండలం యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన నూనెవత్ బిచ్చు TS 08 UG 6589 టాటా ఏసీ వాహనంలో 14 క్వింటల్లా రేషన్ బియ్యం లభించాయి.  పై నలుగురు వ్యక్తులు మూడు వాహనాలలో ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా  రాయపోల్ మండలంలోని  వివిధ గ్రామాలలో తక్కువ రేటుకు ప్రభుత్వ రేషన్ బియ్యం కొనుగోలు చేసి ఎక్కువ రేటుకు అమ్ముదామని  అక్రమంగా వాహనాలలో తరలిస్తున్నారని నమ్మదగిన సమాచారం పై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు రాయపోల్ పోలీసులు కలిసి అంకిరెడ్డిపల్లి గ్రామ శివారులో  రెండు వాహనాలను, వడ్డేపల్లి గ్రామ శివారులో ఒక వాహనాన్ని చాకచక్యంగా పట్టుకున్నారు. మొత్తం ఈ మూడు వాహనాలలో 80 క్వింటాళ్ల  ప్రభుత్వ రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసే వాటిని కట్టుకోవడం జరిగిందన్నారు. సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం జిల్లాలో ఎక్కడైనా ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక,  పిడిఎస్ రైస్ అక్రమ రవాణా చేసిన నిల్వ ఉంచిన, చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూదం, గ్యాంబ్లింగ్ చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.గ్రామాలలో, పట్టణాలలో ఇసుక అక్రమ రవాణా చేసిన, పిడిఎస్ రైస్ అక్రమంగా దాచిపెట్టిన రవాణా గ్యాంబ్లింగ్, పేకాట, మరిఏదైనా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే సిద్దిపేట టాస్క్ ఫోర్స్ అధికారుల నెంబర్లు 8712667445, 8712667446,  8712667447 లకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాయపోల్ ఏఎస్ కృష్ణంరాజు పోలీస్ సిబ్బంది, రెవిన్యూ సిబ్బంది, టాస్క్ ఫోర్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Spread the love