యువతకు స్వయం ఉపాధితో ఎంతో లాభసాటి 

– వైస్ ఎంపీపీ జెల్లా వెంకటేష్
నవతెలంగాణ  – నెల్లికుదురు
స్వయం ఉపాధితో యువతకు ఎంతో లాభసాటి ఉంటుందని వైస్ ఎంపీపీ జిల్లా వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడులు గుగులోతు బాలాజీ నాయక్ దాసరి ప్రకాష్ లు అన్నారు మండలంలోని బ్రాహ్మణ కొత్త పెళ్లి గ్రామంలో పేపర్ ప్లేట్స్ షాప్ ను శుక్రవారం స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత ఒక ఉపాధి నేర్చుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు యువకులు పెద్ద పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు రాక యువత ఇబ్బందులు పడుతున్న తరుణంలో యువత ఒక మంచి మార్గాన్ని ఎన్నుకోవడం సంతోషంగా ఉందని అన్నారు యువకులు స్వయం శక్తితో ముందుకు రావడం పట్ల వారిని అభినందించామని అన్నారు స్వయం శక్తితో ముందుకు రావడం పట్ల గ్రామస్తులు హర్ష వ్యక్తం తెలిపారని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల యువ నాయకుడు జిల్లా ఉపేందర్ , గుగులోత్ దేవేందర్ ,యూత్ గ్రామ శాఖ అధ్యక్షులు పిడుగు రాము , సోమన్న  సిహెచ్ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love