కొయ్యలగూడెం ప్రాథమిక పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
కొయ్యలగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులచే స్థానిక స్వపరిపాలన దినోత్సవ కార్యక్రమం శనివారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా డబ్బికార్ యశ్వల్ ( 5th) ప్రధానోపాధ్యాయులుగా పోశం ఉదయ తేజ (5th)విద్యాశాఖ మంత్రిగా బిల్లా వెన్నెల ఎమ్మెల్యేగా సగ్గం భావన కలెక్టర్ గా వర్కాల స్నేహ ధర్శిని జిల్లా విద్యాధికారిగా రచ్చ అలేఖ్య మండల విద్యాధికారిగా బొడ్డు సహస్ర విద్యా కమిటీ చైర్మన్ చైర్మన్ రావుల సాత్విక డాక్టర్ గా డి . అనిరుద్, ఉపాధ్యాయులుగా A.నిశాంత్ రెడ్డి, k . జయశ్రీ, జి. సింధు రాణి, P. వేదాంష్, N. చరణ్ సాయి B. జాహ్నవి,V హిమబిందు, తదితర విద్యార్థులు పాల్గొన్నారు, అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధానోపాధ్యాయులు శ్రీ కె.సురేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం లో పాల్గొన్న విద్యార్థి ఉపాధ్యాయలను అధికారులను అభినందించారు,CM పాత్రదారుడు యశ్వల్ CM కన్వాయి లాంటి వాహన శ్రేనీతో తన ఆహాభావాలతో విద్యార్థులను ఉపాధ్యాయులును అల్లరింపచేసాడు అందుకు గాను బెస్ట్ అవార్డు అందచేశారు . ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటి చైర్మన్ వర్కాల రఘురామ్ గ్రామ పెద్దలు జెల్లా వెంకటేశ్వర్లు బహుమతుల దాత తదితరులు పాల్గొన్నారు.

Spread the love