అనుముల పాఠశాలలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

నవతెలంగాణ – హలియా 
అనుముల ప్రాథమిక పాఠశాలలో శనివారం  ఘనంగా స్వపరిపాలన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు జె చంద్రుడు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని  ఉపాధ్యాయులుగా, అధికారులుగా, పరిపాలకులుగా వివిధ హోదాల్లో ఎలాగైతే  వ్యవహరించారో అదేవిధంగా నిజజీవితంలో కూడా  ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. స్వపరిపాలన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా తోకల గంగోత్రి, ఎమ్మెల్యేగా అల్లి రోహిత్, ఎమ్మెల్సీగా చినాల శ్రావ్య, జిల్లా కలెక్టర్ గా అందుగుల అక్షయ, డీఈవోగా బ్యూల, మండల విద్యాధికారిగా పాల్వాయి పూజిత, కాంప్లెక్స్ హెచ్ఎం గా జశ్వంత్, ప్రధానోపాధ్యాయులుగా టి. బిందు శ్రీ మరియు ఇతర విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులుగా, అధికారులుగా వ్యవహరించడం జరిగింది. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులకు అధికారులకు ప్రధానోపాధ్యాయుల చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో  ఉపాధ్యాయులు లోక్యానాథ్, నిమ్మల నిర్మల దేవి, మన్నెం వెంకటేశ్వర్లు, మంచి కంటి మధుసూధన్ ,కంచర్ల రజిత,కట్టెబోయిన సౌజన్య, తూటిపల్లి స్వాతి తదితరులు పాల్గొన్నారు.
Spread the love