Thursday, May 7, 2026
E-PAPER
Homeబీజినెస్సెన్సెక్స్‌ 940 పాయింట్ల పరుగు

సెన్సెక్స్‌ 940 పాయింట్ల పరుగు

- Advertisement -

ముంబయి : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయన్న సానుకూల వార్తలతో బుధవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికా, ఇరాన్‌ దేశాలు ఒక ఒప్పందానికి చేరువయ్యాయన్న సమాచారంతో అంతర్జా తీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ ధర ఏకంగా 9 శాతం క్షీణించి 100 డాలర్ల మార్కుకు చేరువవటం మార్కెట్‌కు మద్దతు నిచ్చింది. దీంతో చివరి గంటలో సెన్సెక్స్‌ 940 పాయింట్లు ఎగ బాకి 77,958కు చేరుకుంది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 298 పాయింట్ల లాభంతో 24,330 వద్ద ముగిసింది. ఈ ఒక్కరోజే ఇన్వెస్టర్ల సంపద సుమారు రూ.6 లక్షల కోట్లు పెరగడం విశేషం.
ఇండిగో షేర్లు 6 శాతం మేర దూసుకుపోగా.. ట్రెంట్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. మరోవైపు రిలయన్స్‌, ఎల్‌అండ్‌టీ వంటి దిగ్గజాలు స్వల్ప నష్టాలను చవిచూశాయి. రూపాయి విలువ కూడా 56 పైసలు బలపడి 94.62 వద్ద ముగిసింది. అంతర్జాతీయ విపణిలో బంగారం ధర ఔన్సు 4700 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మొత్తానికి యుద్ధ మేఘాలు తొలగిపోతున్నాయన్న ఆశలు దలాల్‌ స్ట్రీట్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -