నవతెలంగాణ – హైదరాబాద్ : భారతదేశపు ప్రముఖ ఆన్-డిమాండ్ కన్వీనియెన్స్ ప్లాట్ ఫాం స్విగ్గీ లిమిటెడ్ (NSE: SWIGGY/BSE: 544285), సరసమైన ధరల విభాగంలో విలక్షణమైన ఆఫరింగ్ గా పరిచయం చేసిన 99 స్టోర్ గత ఏడాది సమయంలో గొప్ప అభివృద్ధిని సాధించిందని ఈరోజు ప్రకటించింది. జులై 2025లో ప్రారంభించబడిన, 99 స్టోర్ ఇప్పుడు ప్లాట్ ఫాం యొక్క ప్రతి 7 ఫుడ్ ఆర్డర్లలో 1గా లెక్కించబడుతూ, విలువ ప్రోత్సాహిత ఆహార ఎంపికల కోసం శక్తివంతమైన డిమాండ్ కు సంకేతం ఇస్తోంది. ఈ ఆఫరింగ్ దేశవ్యాప్తంగా 500కి పైగా నగరాల్లో 1.8 లక్షలు కంటే ఎక్కువ రెస్టారెంట్ భాగస్వాములతో శక్తివంతమైన నెట్ వర్క్ ను ఏర్పరుచుకుని తన ఉనికిని విస్తరించింది-ఇది అందుబాటులో ఉండే ధరలతో కూడిన ఆహార డెలివరీ రంగంలో విస్తృతమైన భాగస్వామ్య నెట్ వర్క్ లలో ఒకటిగా నిలిచింది.
స్విగ్గీ ఫుడ్ యాప్ లో 99 స్టోర్ కు ప్రత్యేకమైన విభాగం ఉంది. ఇది రోజూ వినియోగించడానికి భాగస్వామ్య బ్రాండ్స్ నుండి ఎంపిక చేయబడిన, అందుబాటులో ఉండే ధరలతో కూడిన ఆహార పదార్థాలు మరియు భోజనాలను రూ. 49, రూ. 79 మరియు రూ.99కి చూపిస్తుంది మరియు రూ.49 కంటే ఎక్కువ ఆర్డర్ల కోసం ఉచిత డెలివరీని అందచేస్తుంది. నమ్మకమైన బ్రాండ్లలో నాణ్యమైన ఆహారం మరియు భోజనాల ఎంపికల కోసం ఎదురుచూసే విలువ-స్ప్రహ కలిగిన కస్టమర్లకు ఇది సరసమైన ధరలకు అందిస్తుంది. గత ఏడాది సమయంలో, ఆరోగ్యకరమైన ఆహార ఎంపికల కోసం ప్రాధాన్యతనివ్వబడిన ప్లాట్ ఫాంగా కూడా ఇది అభివృద్ధి చెందింది. 99 స్టోర్ కేవలం ఆర్డర్ పరిమాణాన్ని పెంచడమే కాకుండా, కొత్త నగరాలకు కూడా ఇది చేరుకోవడం విస్తరిస్తోంది, కొత్త రెస్టారెంట్ భాగస్వాములను చేర్చుకుంటోంది, స్విగ్గీకి కొత్త యూజర్లను తెస్తోంది మరియు మొత్తం కస్టమర్ నిలిచి ఉండటం మెరుగుపరచడం-ఇవన్నీ ఒకే విలువ ప్రతిపాదనపై ఆధారపడి ఉంటాయి. ఇది శ్రేణుల్లో ఆహారం అందించడమే కాకుండా, 99 స్టోర్ లో అత్యంత ప్రసిద్ధి చెందిన ఆహార ఎంపికలైన బౌల్స్ మరియు థాలీస్, సౌత్ ఇండియన్ బ్రేక్ ఫాస్ట్, బర్గర్స్ మరియు అమెరికన్ ఫుడ్, పిజ్జాస్, బెవరేజెస్, చాట్స్ మరియు ఇతర స్నాక్స్ ను కూడా అందిస్తుంది.
భారతదేశంలో టియర్-1, 2 మరియు 3 నగరాల్లోని కస్టమర్లు భారతదేశపు అతి పెద్ద QSR చెయిన్స్ నుండి ఆహార పదార్థాల సమూహం నుండి లోతైన స్థానిక, నగర-నిర్దిష్టమైన బ్రాండ్స్ ను కూడా ఎంచుకోవచ్చు. బర్గర్ కింగ్, మెక్ డొనాల్డ్, KFC, డోమినోస్ పిజ్జా మరియు టాకో బెల్ వంటి నమ్మకమైన మరియు అభిమానించే బ్రాండ్స్ నుండి కూడా కస్టమర్లు ఆర్డర్ చేయవచ్చు. ఇంకా, అత్యంతగా అభిమానించే దేశీయ బ్రాండ్స్ కూడా 99 స్టోర్ లో అత్యంత చురుకుగా ఉన్న భాగస్వాములుగా నిలిచాయి మరియు ప్రాంతీయ గుర్తింపును మరియు విలువను అందించే రూపానికి లోతైన స్థానిక విధేయతను తీసుకువస్తున్నాయి.
99 స్టోర్ విజయం గురించి మాట్లాడుతూ, సిద్ధార్థ భాకూ, ఛీఫ్ బిజినెస్ ఆఫీసర్, స్విగ్గీ ఫుడ్ మార్కెట్ ప్లేస్, ఇలా అన్నారు, ” భారతదేశం టియర్ -1,2 మరియు 3 నగరాల్లో, విద్యార్థుల నుండి ఉద్యోగాలు చేసే నిపుణుల వరకు విలువ-స్ప్రహ కలిగిన, అందుబాటులో ఉండే ధరలకు అత్యంత నాణ్యమైన ఆహారం మరియు భోజనాల ఎంపికలను కోరుకునే వినియోగదారులు భారీ సంఖ్యలో ఉన్నారు. అందుబాటులో ఉండే ధరలకు ప్రాధాన్యతనిచ్చే యూజర్ల కోసం 99 స్టోర్ ఉద్దేశ్యపూర్వకంగా రూపొందించబడింది, మరియు గతంలో కేవలం ప్రత్యేకమైన సందర్భాల కోసం మాత్రమే ఆన్ లైన్ లో ఆహారాన్ని ఆర్డర్ చేసే వారిని క్రమం తప్పకుండా ఆర్డర్లు ఇచ్చే కస్టమర్లగా విజయవంతంగా మార్చింది. గత ఏడాదిలో వచ్చిన ప్రతిస్పందన అనూహ్యంగా నిలిచింది మరియు నెలవారీ ఆర్డర్లు గత ఏడాది కంటే 2.4 రెట్లు పెరిగాయి. వినియోగదారుల ప్రేమ మాత్రమే కాకుండా, ఇది కొత్త కస్టమర్లను ప్రోత్సహించడం ద్వారా మా రెస్టారెంట్ భాగస్వాముల కోసం గెలుపొందే ప్రతిపాదనగా కూడా కూడా నిరూపించబడింది మరియు అత్యధిక నిలకడకూ కూడా హామి ఇచ్చింది. భవిష్యత్తులో మేము మా భాగస్వామ్య నెట్ వర్క్ ను విస్తరించడానికి కట్టుబడ్డాము మరియు మా 99 స్టోర్ కస్టమర్లకు విస్తృతమైన ఎంపికను కూడా తీసుకువస్తున్నాము.”
99 స్టోర్ తో, రెస్టారెంట్ భాగస్వాములకు ఇంతకు ముందు కోల్పోయే అవకాశమున్న కస్టమర్ల వర్గం నుండి ఎన్నో ఆర్డర్లు వస్తున్నాయి. ఇంకా, 99 స్టోర్ అందుబాటులో ఉండే ధరలను కోరుకునే యూజర్ల కోసం అలవాటును కలిగిస్తోంది. ప్లాట్ ఫాంతో పోలిస్తే 99 స్టోర్ లో మొదటిసారి ఆర్డర్ చేసే వినియోగదారులు ఎక్కువ కాలం కొనసాగుతున్నారని, మరియు అప్పుడప్పుడు వచ్చే వినియోగదారులు ఎల్లప్పుడూ ఆర్డర్ చేసే కస్టమర్లుగా మారుతున్నారని డేటా స్థిరమైన ఫలితాలను చూపిస్తోంది. ఇంకా, ప్రత్యేకమైన 99 స్టోర్ విభాగం ద్వారా మెరుగ్గా కనుగొనడం : అత్యధిక నిమగ్నతను నిర్థారిస్తోంది.


