గుండెపోటుతో కాంట్రాక్టు సెర్ప్ ఉద్యోగి మృతి చెందిన సంఘటన ఆదివారం ఆళ్ళపల్లి మండలంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండలంలోని మర్కోడు గ్రామానికి చెందిన తాళ్లపల్లి వెంకటనారాయణ (58) శనివారం అర్ధరాత్రి దాటాక హఠాత్తుగా చాతిలో నొప్పి రావడంతో కుప్పకూలారని, గమనించిన భార్య కుటుంబ సభ్యులను పిలిచే లోపే మృతి చెందాడని తెలిపారు. మండలంలో ఐకేపీ బుక్ కీపర్ గా సుపరిచితుడు, మంచి మనసు గల వెంకటనారాయణ అకాల మరణంతో కుటుంబ సభ్యులు విలపించిన తీరు చూపరులకు సైతం కంటతడి పెట్టించింది. విషయం తెలుసుకున్న స్థానిక మాజీ జడ్పీటీసీ కొమరం హనుమంతరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాయం రామనర్సయ్య, మాజీ ఎంపీపీ పడిగ సమ్మయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాయం నరసింహారావు, న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా నాయకులు కొమరం సత్యనారాయణ, ప్రజాపంథా మాస్ లైన్ జిల్లా నాయకులు మాచర్ల సత్యం, సీపీఐ జిల్లా నాయకులు రేసు ఎల్లయ్య, వెలుగు సిబ్బందితో పాటు పలువురు మృతుడి ఇంటికి చేరుకుని, మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు.