– పరీక్షా హాల్ లో గోడ గడియారాలు ఏర్పాటు…
– నాలుగో రోజు కి చేరిన ఇంటర్ పరీక్షలు
నవతెలంగాణ – అశ్వారావుపేట
పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ నివారణ చర్యల్లో భాగంగా ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ విభాగం హాల్ లోకి సెల్ ఫోన్,చేతి గడియారం,షూస్ లు నిరాకరించడంతో పరీక్షార్ధులు కు సమయం తెలియక ఇబ్బంది పడుతున్నారు.ఈ విద్యార్ధులు అత్యధికులు సమయం తెలియక ఎంత సేపు రాయాలి అనేది తెలియక అయోమయం అయిన సంగతి తెలుసుకున్న ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టింది. ఈ క్రమంలో ప్రతీ పరీక్ష గదిలో గోడ గడియారం ఏర్పాటు తో పాటు ప్రతీ అర్ధగంట కు బెల్ మోగించి సమయం తెలిపే విధంగా ఏర్పాట్లు చేయాలని పరీక్షా కేంద్రాల సీఎస్, డీఓ లకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఆదివారం సిబ్బంది గోడ గడియారాలు ఏర్పాటు చేయించినట్లు అశ్వారావుపేట పరీక్షా కేంద్రాల కస్టోడియన్ డి.నరసింహారావు తెలిపారు.
నాలుగో రోజుకి చేరిన ఇంటర్ పరీక్షలు:
772 మందికి 761 హాజరు..
772 మందికి 761 హాజరు..
11 మంది గైర్హాజర్.
బుధవారం ప్రారంభం అయిన పరీక్షలు సోమవారం నాటికి నాలుగో రోజుకు చేరాయి.నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల,ముస్లిం మైనార్టీ బాలికల జూనియర్ కళాశాల,వీకేడీవీఎస్ రాజు జూనియర్ కళాశాల ల్లో ఏర్పాటు చేసిన మూడు పరీక్షా కేంద్రాల్లో ఈ మూడూ కళాశాల తో పాటు దమ్మపేట మండలంలోని మందలపల్లి సాంఘీక సంక్షేమ గురుకుల కళాశాల,దమ్మపేట లోని గిరిజన సంక్షేమ శాఖ గురుకుల కళాశాల,అంకంపాలెం గిరిజన సంక్షేమ శాఖ బాలికల కళాశాల విద్యార్ధులు పరీక్షలు రాస్తున్నారు. ఈ మూడు కేంద్రాల్లో, ఆరు కళాశాల లు నుండి ద్వితీయ సంవత్సరం ఆంగ్ల సబ్జెక్ట్ పరీక్షకు 772 మంది హజరు కావాల్సి ఉండగా 761 మంది హాజరు అయ్యారు.11 మంది పరీక్షలకు గైర్హాజరు అయ్యారు. ఆయా పరీక్షల కేంద్రాలకు సీఎస్ (చీప్ సూపరింటెండెంట్), డీఓ(డిపార్ట్ మెంట్ ఆఫీసర్) ,కస్టోడియన్ లుగా అల్లు అనిత, జెడ్.ఉషా రత్నం, కే.రవీంద్రబాబు, ఎం.ఝాన్సీ లక్ష్మి, బి.సంగీత, బి.కుమారస్వామి, డి.నరసింహారావు లు విధులు నిర్వహిస్తున్నారు.
కళాశాల ఎలాట్మెంట్ ప్రెసెంట్ ఆబ్సెంట్
జీజేసీ 307 300 07
టీఎంఆర్ 146 144 02
వీకేడీవీఎస్ 319 317 02
మొత్తం 772 761 11