ఎండ వేడిమిలో వన్యప్రాణుల దాహార్తిని తీర్చడాని కోసం ఏర్గట్ల మండల కేంద్రంలోని భీమన్న గుట్ట,దాని ప్రక్కన ఉన్న అటవీ పరిసర ప్రాంతాల్లో ఐదు నీటి సాసర్లను ఏర్పాటు చేసినట్లు కమ్మర్ పెల్లి రేంజ్ ఫారెస్ట్ అధికారి రాథోడ్ తుకారం తెలిపారు. ప్రజలు మూగ జీవాల కోసం, తమవంతుగా వేసవి కాలంలో నీటి వసతి కల్పించి వాటి మనుగడకు సహకరించాలని కోరారు. ఆయనతో పాటు బీట్ ఆఫీసర్ లింగన్న ఉన్నారు.