వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు మృతి

Road-Accidentనవతెలంగాణ – హైదరాబాద్: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో హైదరాబాద్‌కు చెందిన ఏడుగురు మరణించారు. శ్రీశైలం జలాశయాన్ని చూడడానికి వెళ్తూ కారు రాత్రి చెట్టును ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న మచ్చ బొల్లారానికి చెందిన సాయి ప్రకాష్, కన్నయ్య అక్కడికక్కడే మృతి చెందారు. మరో ప్రమాదంలో కొత్తగూడ వంతనపై బైక్ అదుపుతప్పి రైలింగ్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాల ప్రసన్న, రోహిత్ దుర్మరణం పాలయ్యారు. కేపీహెచ్‌బీ నుంచి వెళుతూ బైక్‌ను రైడర్ నిర్లక్ష్యంగా నడిపాడు. ఎన్ఐఏ ఫ్లై ఓవర్ వద్ద బైకు కింద పడింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెనుక కూర్చున్న జయశంకర్ అనే వ్యక్తి ఒక్కసారిగా కిందపడటంతో వెనుక నుంచి కంటైనర్ ట్రక్ తలపైకి ఎక్కడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. రంగాపూర్ మలుపు వద్ద కారును ఓవర్ టేక్ చేయబోయి బస్సును బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఫలక్ నుమ ప్రాంతానికి చెందిన తల్లీకుమారుడు మృతి చెందారు.

Spread the love