శనిగరం ప్రాజెక్టు కాలువలు పూడ్చిన పలువురు గ్రామస్థులు 

నవతెలంగాణ-కోహెడ
సాక్షత్తు బీసీ,రవాణా సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,జిల్లా కలెక్టర్ మను చౌదారి చెప్పిన శనిగరం గ్రామస్థులు పట్టించుకోవడం లేదని వింజపల్లి, రాంచంద్రపూర్ గ్రామస్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పర్యటనకు వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు కోహెడ మండలం వింజపల్లి,రాంచంద్రపూర్ రైతులుతమ పంటలు ఎండిపోతున్నాయని శనిగరం ప్రాజెక్టు నుంచి మోయాతుమ్మెద వాగు ద్వారా విడుదల చేయాలని వినతి పత్రం అందించారు. స్పందించిన జిల్లా కలెక్టర్ ఇరిగేషన్ ఈఈ,డీఈ కి పంటలు ఎండకుండా తక్షణమే నీటిని విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చారు. కానీ మా ఊరు ప్రాజెక్టు నుంచి ఇతర గ్రామాలకు నీటిని విడుదల చేయమని బీఆర్ఎస్ నాయకులు నీరు వచ్చే కాలువలలో బండ రాళ్లు,మట్టి ని వేసి కాలువలు పూడ్చి వేశారని పలువురు చేర్చించుకుంటున్నారు. ఈ విషయం పై అధికారులను సంప్రదింగా నీటి కాలువలు ద్వాంసం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులకు సమాచారం అందించమన్నారు. కాగా మంత్రి పొన్నం,కలెక్టర్ ఆదేశాలు ఇచ్చిన కొందరు లెక్కచేయకుండా ప్రవర్తించి పంటలు ఎండేలా చేస్తున్నారని మండిపడుతున్నారు. నీటి విడుదల నిలిపివేస్తే సుమారు మూడు గ్రామాల్లో 500 ఎకరాల వరి పంట ఎండనుందని ఆందోళన వ్యక్తంచేశారు.
Spread the love