నవతెలంగాణ-ఆర్మూర్
పట్టణంలోని అన్నపూర్ణ కాలనీలోని కోటార్మూరు 6వ వార్డులో కొత్తగా నిర్మించిన ఇండ్లకు డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో మురికి నీరు నేరుగా రోడ్డుపై ప్రవహిస్తూ స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. రోడ్డుపై నిల్వ ఉండే మురికి నీటితో దుర్వాసన వ్యాపించడమే కాకుండా దోమలు, పందుల బెడద రోజురోజుకూ పెరుగుతోందని కాలనీవాసులు సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు.
వర్షాకాలం నేపథ్యంలో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నప్పటికీ మున్సిపల్ అధికారులు సమస్యను పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. కొత్తగా నిర్మించిన ఇళ్లకు డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయకుండా నిర్మాణాలను పూర్తి చేయడం వల్ల మురికి నీరు రోడ్డుపైకి, సమీప ఖాళీ స్థలాల్లోకి చేరి ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తోందని తెలిపారు. డ్రైనేజీ సౌకర్యం కల్పించకుండా ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఎలా ఇచ్చారనే అంశంపై కూడా అధికారులు విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ స్పందించి వెంటనే డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరారు. లేనిపక్షంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించి ఆందోళన కార్యక్రమాలుచేపడతామని హెచ్చరించారు.
రోడ్డుపై ప్రవహిస్తున్న మురికి నీరు.. పట్టించుకోని అధికారులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



