రెసిడెన్షియల్ స్కూల్ ని డిఈఓ సందర్శించాలి : ఎస్ఎఫ్ఐ నాయకుల డిమాండ్ 

నవతెలంగాణ –  కంటేశ్వర్ 
నిజామాబాద్ నగరంలో గల అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ ని జిల్లా విద్యాశాఖ అధికారి సందర్శించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ హాస్టల్ యూనిట్ కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో ఖిల్లా చౌరస్తా ప్రాంతంలో గల  అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ లో సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా యూనిట్ కమిటీ కార్యదర్శి బాబురావు మాట్లాడుతూ.. అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో ఈరోజు మెనూ ప్రకారం చికెన్ పెట్టాలి, కానీ బిల్స్ రాని కారణంగా టెండర్ వేసిన అతను పెట్టలేదు.  అలాగే గుడ్లు కూడా పెట్టడం లేదు. దానితో పాటు కుళ్లిపోయిన కూరగాయలు ఉన్నాయని, స్కూల్ హెడ్మాస్టర్ తో మాట్లాడితే, సమస్య పరిష్కరిస్తామని అన్నారు. అలాగే జిల్లా విద్యాశాఖ అధికారి  ఈ స్కూలు వెంటనే సందర్శించి ఇతర సమస్యలు, ముఖ్యంగా తరగతి గదులు సరిపోకపోవడం, నీటి సమస్య ఉన్నాయని, వాటిని పరిష్కరించాలి అని కోరుతున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ యూనిట్ కమిటీ సభ్యులు వరదరాజు,సజన్, శివ తదితరులు పాల్గొన్నారు.
Spread the love