
దామరచర్ల మండల కేంద్రంలోని శాంతినికేతన్ ఉన్నత పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా విద్యార్థులు ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులుగా పాత్రలను పోషించారు . విద్యార్థులు పోషించిన పాత్రలను నిజం చేసుకునేందుకు కృషి చేసి ,ఉన్నత శిఖరాలకు ఎదగాలని ప్రిన్సిపాల్ లిమా మేరీ ఆకాక్షించారు.అనంతరం అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు . ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సిస్టర్ లిమా మేరీ ,ఉపాధ్యాయులు సత్యనారాయణ , హనుమాన్ ,భీష్మా రెడ్డి , శ్రీను ,కిషన్ ,శేఖర్ , జాన్ పీటర్ , సునీత ,సులోచన , కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.