- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో జరిగిన శోభ(31) హత్య కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమెను చంపి మృతదేహాన్ని రంగారెడ్డిగూడలో పడేసినట్లు గుర్తించారు. ఆమె మృతదేహాన్ని తరలించే దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఆమెను మహబూబ్‌నగర్ జిల్లా వీరన్నపేటలో హత్య చేసినట్లు సమాచారం. ఆదివారం రంగారెడ్డిగూడ శివారులోని ఓ పొలంలో శోభ మృతదేహం కనపడింది. ఆ పక్కనే రోదిస్తున్న చిన్నారిని గమనించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
- Advertisement -



