నవతెలంగాణ – హైదరాబాద్; తెలంగాణ మందుబాబులకు ఊహించని షాక్ తగిలింది. ఎల్లుండి మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్, అలాగే సికింద్రాబాద్ జంట నగరాలలో… వైన్స్ షాపులు బంద్ కానున్నాయి. ఈనెల 12వ తేదీ హనుమాన్ జయంతి ఉన్న నేపథ్యంలో… మద్యం దుకాణాలు మూసివేయాలని హైదరాబాద్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.