ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి..

నవతెలంగాణ – నవీపేట్: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ పరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించి సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎం భూమేశ్వర్ గౌడ్ అన్నారు. మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ప్రభుత్వ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించి మద్దతు ధరతో పాటు బోనస్ ను పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ కమిటీ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ రాజేందర్ కుమార్ గౌడ్ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఉషారాణి, బుచ్చన్న, మహిపాల్ రెడ్డి, సంజీవరెడ్డి,మోస్రా సాయి రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Spread the love