వేసవిలో చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి 

– డేగల శంకర్ పంచాయతీ కార్యదర్శి 
నవతెలంగాణ-గోవిందరావుపేట 
వేసవికాలంలో రైతులు ప్రయాణికులు తాము ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని పంచాయతీ కార్యదర్శి డేగల శంకర్ అన్నారు. బుధవారం గ్రామపంచాయతీ కార్యాలయం  ముందు బస్టాండ్  ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ దివాకర్ గారి ఆదేశానుసారం చలివేంద్రాన్ని కార్యదర్శి డేగల శంకర్ ప్రారంభించి మాట్లాడారు.  ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల, ప్రయాణికులు గ్రామ ప్రజల దాహార్తిని తీర్చాలనే ఉద్దేశంతో, చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు  తెలిపారు.  ఎండాకాలం పూర్తయ్యే వరకు, పంచాయతీ సిబ్బంది పర్యవేక్షణలో నిరంతరం ప్రయాణికులకు చల్లని మంచినీళ్లు అందుబాటులో ఉంచుతామని, ప్రయాణికులు ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని, చలివేంద్రం  చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యాలయ సిబ్బంది అశోక్, శివ, అలెగ్జాండర్, నెమలి నరసయ్య, సిబ్బంది మరియు గ్రామ ప్రజలు మహిళలు పాల్గొన్నారు.
Spread the love