Sunday, May 24, 2026
E-PAPER
Homeఆటలుశతక్కొట్టిన శ్రేయస్‌

శతక్కొట్టిన శ్రేయస్‌

- Advertisement -

లక్నోపై పంజాబ్‌ ఘన విజయం
ప్లే ఆఫ్స్‌ రేసులో పంజాబ్‌ ఆశలు సజీవం
లక్నో 196/6 పంజాబ్‌ 200/3

పంజాబ్‌ ఎట్టకేలకు ఓ విజయం సాధించింది. వరుసగా ఆరు పరాజయాలతో ప్లే ఆఫ్స్‌ అవకాశాలను చేజేతులా సంక్లిష్టం చేసుకున్న పంజాబ్‌ ‌కింగ్స్‌.. శ్రేయస్‌ అయ్యర్‌ (101 ‌నాటౌట్) సెంచరీ విన్యాసంతో లక్నో సూపర్‌‌జెయింట్స్‌‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 14 మ్యాచ్‌‌ల్లో 15 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవంగా నిలుపుకుంది. నేడు ముంబయి చేతిలో రాజస్తాన్‌ ‌రాయల్స్‌ ఓడితే పంజాబ్‌ ‌కింగ్స్‌ ‌టాప్‌-4‌లో నిలువనుంది.

నవతెలంగాణ-లక్నో
శ్రేయస్‌ అయ్యర్‌ (101 ‌నాటౌట్‌, 51 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్‌‌లు) అజేయ సెంచరీతో చెలరేగాడు. ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవంగా నిలిచేందుకు కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్‌‌లో శ్రేయస్‌ అయ్యర్‌ ‌కెప్టెన్సీ ఇన్నింగ్స్‌ ‌నమోదు చేశాడు. ప్రభుసిమ్రన్‌ ‌సింగ్‌ (69, 39 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌‌లు) అర్థ సెంచరీతో కదం తొక్కాడు. శ్రేయస్‌, ప్రభుసిమ్రన్‌ ‌మూడో వికెట్‌‌కు 142 పరుగుల భారీ భాగస్వామ్యంతో పంజాబ్‌ ‌కింగ్స్‌‌ను గెలుపు బాటలో నడిపించారు. ప్రియాన్షు ఆర్య (0) ఇన్నింగ్స్‌ ‌తొలి బంతికే వికెట్‌ ‌కోల్పోగా, కూపర్‌ ‌కానొలి (18, 10 బంతుల్లో 4 ఫోర్లు) పవర్‌‌ప్లేలోనే నిష్ర్కమించాడు. 22/2తో ఒత్తిడిలో పడిన పంజాబ్‌ ‌కింగ్స్‌‌ను శ్రేయస్‌, ప్రభుసిమ్రన్‌ ‌నిలబెట్టారు. ఛేదనలో సూపర్‌‌కింగ్స్‌ ‌బౌలర్లపై ఎదురుదాడి చేశారు. శ్రేయస్‌ ఆఖర్లో సిక్సర్ల వర్షం కురిపించాడు. సిక్సర్‌‌తో 51 బంతుల్లోనే సెంచరీ సాధించిన శ్రేయస్‌ అయ్యర్‌‌కు ఐపీఎల్‌‌లో ఇదే తొలి శతకం. సూపర్‌‌జెయింట్స్‌ ‌బౌలర్లలో మహ్మద్‌ ‌షమి (2/45), అర్జున్‌ ‌టెండూల్కర్‌ (1/36) ‌రాణించారు. 18 ఓవర్లలోనే 200 పరుగులు చేసిన పంజాబ్‌‌ కింగ్స్‌ 7 ‌వికెట్ల తేడాతో గెలుపొందింది.

​రాణించిన ఇంగ్లిశ్‌
జోశ్‌ ఇంగ్లిశ్‌ (72, 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌‌లు) అర్థ సెంచరీతో మెరవటంతో లక్నో సూపర్‌‌జెయింట్స్‌ ‌తొలుత 20 ఓవర్లలో 6 వికెట్లకు 196 పరుగులు చేసింది. 2 సిక్స్‌‌లు, 9 ఫోర్లు బాదిన ఇంగ్లిశ్‌ 28 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. అర్షిన్‌ ‌కులకర్ణి (0), నికోలస్‌ ‌పూరన్‌ (2) నిరాశపరిచినా.. ఆయుశ్‌ ‌బదొని (43, 18 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌‌లు), రిషబ్‌ ‌పంత్‌ (26, 22 బంతుల్లో 3 ఫోర్లు) జతగా ఇంగ్లిశ్‌ ‌కీలక భాగస్వామ్యాలు నిర్మించాడు. ముకుల్‌‌ చౌదరి (1) నిరాశపరిచినా.. అబ్దుల్‌ ‌సమద్ (37 నాటౌట్‌, 20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌‌లు) ధనాధన్ ఇన్నింగ్స్‌ ఆడాడు. పంజాబ్ కింగ్స్‌ ‌బౌలర్లలో చాహల్‌, యాన్సెన్‌ ‌రెండేసి వికెట్లు పడగొట్టారు.

​సంక్ష‍ిప్త స్కోరు వివరాలు :
లక్నో సూపర్‌‌జెయింట్స్‌ : 196/6 (జోశ్‌ ఇంగ్లిశ్‌ 72, ఆయుశ్‌ ‌బదొని 43, అబ్దుల్‌ ‌సమద్‌ 37, చాహల్‌ 2/25, యాన్సెన్‌ 2/33)
పంజాబ్‌ ‌కింగ్స్‌ : 200/3 (శ్రేయస్‌ అయ్యర్‌ 101, ప్రభుసిమ్రన్‌ ‌సింగ్‌ 69, కూపర్‌ 18, మహ్మద్‌ ‌షమి 2/45, అర్జున్‌ ‌టెండూల్కర్‌ 1/36)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -