ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ 

– కాంగ్రెస్ పార్టి అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్
నవతెలంగాణ- కమ్మర్ పల్లి: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తుందని కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే  అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. మంగళవారం వేల్పూర్ మండలం జాన్కంపెట్, సాహెబ్ పేట్ గ్రామాలలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో బాగంగా ముత్యాల సునీల్ కుమార్ ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టికి అండగా ఉండి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎకరానికి పెట్టుబడి సాయం రైతు భరోసా రూ.15వేలకు పెంచడం జరుగుతుందన్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బందు పేరు చెప్పి రైతులకు రావాల్సిన అన్ని సౌకర్యాలు రాకుండా  మోసం చేసిందని, రైతు దగ్గర ధాన్యం కొనుగోలులోనూ రైతులను మోసం చేసిందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు భరోసా కింద పెట్టుబడి సాయం రూ.15వేలకు పెంచుతామని తెలిపారు. అలాగే రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఆడబిడ్డలకు రూ.5వందలకు గ్యాస్ సిలిండర్, భూమి లేని ఉపాధి కూలీలకు సంవత్సరానికి రూ.12వేలు,  ప్రభుత్వం వచ్చిన తొలి యాడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి చెల్లిస్తామని తెలిపారు. ఇళ్ళు లేని వారికి ఇళ్ళు కట్టుకోవడానికి రూ.5లక్షల సాయం అందిస్తామన్నారు.ఈసారి కాంగ్రెస్ పార్టికి అవకాశం ఇచ్చి తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు  పాల్గొన్నారు.
Spread the love