భక్తురాలికి వైద్యం చేయించిన సింగరేణి రెస్క్యూ టీం

నవతెలంగాణ – తాడ్వాయి
మేడారం జాతరకు వనదేవతల దర్శనానికి వచ్చిన భక్తురాలు మంళవారం శ్రీ సమ్మక్క – సారలమ్మ గద్దెల వద్ద భక్తులు కొబ్బరికాయలు కొడుతున్న సందర్భంలో మహాబాద్ జిల్లా కు చెందిన శ్రీజ అనే భక్తురాలి పెదవికి గాయం తగలడంతో, అక్కడే ఉన్న సింగరేణి రెస్క్యూ  టీం వైద్య సిబ్బంది వెంటనే శ్రీజని తిరుమల తిరుపతి కళ్యాణ మండపంలో ఉన్న వైద్య కళాశాలకు తీసుకువెళ్లి, ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం శ్రీజ కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి వెళ్ళిపోయారు.
Spread the love