
మండల పరిధిలోని దాచారం గ్రామంలో సీతరామచంద్ర రథోత్సవాన్ని గ్రామస్తులు గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా పూలతో అలంకరించిన సీతరామచంద్ర రథాన్ని గ్రామస్తులు లాగుతూ రథోత్సవంలో భాగస్వాములయ్యారు. పలువురు గ్రామస్తులు ఉత్సాహంగా రథం వద్ద తమ మొక్కలు చెల్లించుకుని దర్శించుకున్నారు.