పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు

– బీర్ల అనిత తన పిల్లలతో కలిసి ఇంటింటి ప్రచారం
– బీర్ల ఐలయ్యకు ఒక అవకాశం ఇవ్వండి
నవతెలంగాణ యాదగిరిగుట్ట రూరల్:  పేద ప్రజలకు  కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అండగా ఉంటాయని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీర్లు ఐలయ్య సతీమణి బీర్ల అనిత అన్నారు. సోమవారం, యాదగిరిగుట్ట మండలంలోని మల్లాపురం గ్రామంలో బీర్ల అనిత తన పిల్లలతో కలిసి ప్రచారం నిర్వహించారు. స్వచ్ఛందంగా సేవ చేస్తున్న బీర్ల ఐలయ్యకు ఒక అవకాశం ఇవ్వాలని ఇటువంటి ప్రచారం నిర్వహించారు. అనేక గ్రామాలలో వాటర్ ఫిల్టర్లు ఏర్పాట్లు, ఇంటింటికి క్యాన్లు పంపిణీ, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఉచిత అంబులెన్సులు వంటి అనేక సేవా కార్యక్రమాలు చేసిన బీర్ల ఐలయ్యను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సేవా కార్యక్రమాలతో పాటు, అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు తో పేదల అభివృద్ధికి కృషి చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి విజయ వీరయ్య, మాజీ సర్పంచ్ మంగ సరిత సత్యనారాయణ, ఎర్ర శ్రీనివాస్, గోపి శ్రీనివాస్, శిఖ అరవింద్, ఎర్ర లావణ్య, ఎర్ర సుజాత తదితరులు పాల్గొన్నారు.
Spread the love