నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్రంలో ఆరుగురు నాన్‌క్యాడర్ ఎస్పీలకు ఐపీఎస్ హౌదాను కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐపీఎస్‌లుగా పదోన్నతులు పొందినవారిలో నరసింహ, శ్రీధర్, శిల్పవల్లి, భాస్కర్, రాంరెడ్డి, చైతన్య కుమార్‌లు ఉన్నారు. పదోన్నతులు పొందిన ఈ అధికారులు డీజీపీ కార్యాలయంలోకి వెళ్లి, జితేందర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.