ప్రభుత్వ పాఠశాలల్లోనే నైపుణ్య బోధన..

– పలు బడుల్లో సామూహిక అక్షరాభ్యాసం..
– కాంప్లెక్స్ హెచ్.ఎం హరిత
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రభుత్వ పాఠశాలలో ఉన్నత విద్యావంతులు,పట్టభద్రులు ఐన ఉపాద్యాయులు చే నైపుణ్య విధ్యాబోధన అందుబాటులో ఉందని కాంప్లెక్స్ హెచ్ ఎం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.హరిత అన్నారు. అశ్వారావుపేట కాంప్లెక్సు పరిధిలోని పలు పాఠశాలల్లో శుక్రవారం బడిబాట లో  భాగంగా శుక్రవారం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలను నిర్వహించారు. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట పరిధిలోని నందమూరి నగర్ ప్రాధమిక పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎం.ఎన్.ఒ ప్రసాద్ రావు, కాంప్లెక్సు ప్రధనోపాధ్యాయురాలు పి.హరిత పాల్గొన్నారు. అంగన్వాడీ ల నుండి 1 వ, తరగతిలో నూతనంగా చేరిన విద్యార్ధులకు ఉచితంగా పలక,బలపం లను పంపిణీ చేసి వారికి అక్షరాభ్యాసం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన బోధన జరుగుతుంది అని ఉన్నత విద్యావంతులు గా ఉన్న ఉపాధ్యాయులు విద్యార్ధులతో మమేకమై ఆటపాటలతో బోధన చేపడుతున్నారని,దీంతో విద్యార్ధికి సునాయాసంగా  అర్ధం అవుతుందని అన్నారు. ట్రిపుల్ ఐ.టి వంటి ఉన్నత విద్యా కోర్సులలో ప్రభుత్వ పాఠశాల విద్యార్ధుల కే తొలి ప్రాధాన్యత కల్పిస్తారని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతులను నిర్వహిస్తున్నామని అన్నారు. విద్యార్దులు అందరు ఉన్నతస్థాయికి ఎదగాలని కాంక్షించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మల్లికార్జునరావు,సి.ఆర్.పి ప్రభాకరాచార్యులు, గ్రామస్తులు బలరాం తదితరులు పాల్గొన్నారు.
Spread the love