చిన్న కాళేశ్వరం పనుల అడ్డగింత

నవతెలంగాణ – మల్హర్ రావు(కాటారం)
చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా గారెపల్లి నూతన రిజర్వాయర్ వద్ద చేపడుతున్న పనులను భూ నిర్వాసిత రైతులు శుక్రవారం అడ్డుకున్నారు. జేసిబితో కట్ట మట్టి తొలగించే పనులను అడ్డుకొని భూములు కోల్పోయిన తమకు నష్ట పరిహారం ఇచ్చాకే పనులు చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు. గత కొన్నేళ్లుగా పరిహారం రాక, పంటలు సాగు చేసుకోలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని, నష్ట పరిహారం ఇచ్చే వరకు పనులు జరగనివ్వమని స్పష్టం చేశారు. నీటి పారుదల శాఖ డీఈఈ ఉపేందర్ రైతులకు నచ్చజెప్పినా వినలేదు. దీంతో తహసీల్దార్ నాగరాజు చేరుకొని సబ్ కలెక్టర్ తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని రైతులతో పేర్కొన్నారు. ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు. కార్యక్రమంలో రైతులు మాచర్ల రాజేందర్, తైనేని సతీష్, పైడాకుల సురేష్, సంతోష్, రాజయ్య, సత్యం, వినోద పాల్గొన్నారు.
Spread the love