భూసార పరీక్షలేవి.?

– నాలుగేళ్లుగా అంతంతే
– రైతులకు అవగాహన కరువు
నవతెలంగాణ – మల్హర్ రావు
సాగులో ఎరువుల వినియోగం తగ్గించడంతోపాటు పంట దిగుబడి పెంచడంలో భూసార పరీక్షలే కీలకం.అయితే మండలంలో ఈ పరీక్షలు ఆటకెక్కాయి.నేల సారవంతంపై అవగాహన లేక రైతులు ఇష్టానుసారంగా ఎరువులు వినియోగిస్తున్నారు. దీంతో పెట్టుబడి పెరగడంతోపాటు పోషకాలు తగు రీతిలో అందక భూమి నిస్సారమైపోతుంది.
భూసార పరీక్షల తీరు ఇలా..రైతులు సాగులో పంట దిగుబడి పెరగాలనే ఆశతో నత్రజని, భాస్వరం, పోటాష్ ఎరువులకె ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.దీంతో నెలల్లో క్రమంగా సమతుల్యత లోపిస్తోంది.ఈ మూడే కాకుండా 16 రకాల సూక్ష్మ దాతు పోషకాలు ఉంటేనే మొక్కల ఎదుగుదలకు అనువుగా ఉంటుంది.ఇందులో జింక్,బోరాన్, మాంగనిస్,ఐరన్, పాస్పరస్, పొటాషియం, నైట్రోజన్, కాల్షియం, కాపర్, సల్పర్, మెగ్నీషియం, క్లోరిన్,కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ వంటివి ఉన్నాయి.అన్ని నెలల్లో ఇవి సమానంగా ఉన్నందున వీటి నిర్దారణకు భూసార పరిక్షలు తప్పనిసరి.గతంలో ప్రభుత్వం ఏటా నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో  పదేకరాలకు ఒక మట్టి నమూనా, వర్షాదారిత  25 ఎకరాలకు ఒక మట్టి  నమూనా సేకరించి పరీక్షలు చేసి రైతులకు నేల పరిస్థితులపై అవగాహన కల్పించేది. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి కానరావడం లేదు.
మండలంలో..మండలంలో కొయ్యుర్,రుద్రారం, తాడిచెర్ల, పెద్దతూoడ్ల మొత్తం  నాలుగు క్లస్టర్లు ఉన్నాయి.వీటి పరిధిలో సుమారుగా 20వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగుతున్నాయి.దాదాపు 9,157 వేల మంది రైతులున్నారు.ఏటా వర్షాకాలం, యాసంగి సీజన్లో వరి, పత్తి,మిర్చి,మొక్కజొన్న తదితర పంటలు సాగుచేస్తున్నారు.అయితే భూసార పరీక్షలపై అవగాహన లేకపోవడంతో ఎరువులు ఎంత మోతాదులో వినియోగించాలనే విషయం తెలియక రైతులు నష్టపోతున్నారు.
మూడేళ్ళుగా అరకొరగానే సేకరణ..2020 వరకు వ్యవసాయ విస్తరణ అధికారులు తమ పరిధిలోని మట్టి నమూనాలు సేకరించి ప్రయోగశాలకు పంపించి రైతులు ఏ పంటలు వేసుకోవాలో ఎంత మోతాదులో ఎరువులు వాడాలో సూచించేవారు.మూడేళ్ళుగా రైతులే నేరుగా ప్రయోగశాలకు మట్టి నమూనాలు తీసుకరావాలని ప్రభుత్వం నిర్ణయించింది.అయితే అవగాహన లోపంతో రైతులు ఈ ప్రక్రియను సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు.ప్రభుత్వం రైతువేదికలు నిర్మించి భూసార. పరిక్షల కిట్ లు అందించినా..మూడేళ్ళుగా రసాయనా సరఫరా నిలిచిపోయింది.దీంతో రైతు వేదికల్లో మట్టి పరీక్షలు పూర్తిగా నిలిచిపోయాయి.
Spread the love