Tuesday, July 21, 2026
E-PAPER
Homeజాతీయందీక్షను కొనసాగిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

దీక్షను కొనసాగిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: తన నిరాహార దీక్షను కొనసాగిస్తానని సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ వెల్లడించారు. ఈ మేరకు సోమవారం ఆయన సతీమణి గీతాంజలి అంగ్మో సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తెలియజేశారు. పార్లమెంట్ లో ఎంపీలు తమతో చర్చలు సాగించినప్పుడు లేదా, ఆస్పత్రిలో తనతో స్వయంగా సంప్రదింపులు జరపాలని డిమాండ్ చేశారు.

“నేను నా నిరాహార దీక్షను (23వ రోజు) కొనసాగిస్తాను. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువత పట్ల ప్రదర్శిస్తున్న అమానుషత్వాన్ని చూసి, యువ నాయకులకు పార్లమెంట్ భవన్‌లో ఎంపీలను కలిసే అవకాశం లభించే వరకు లేదా వారు ఇక్కడ ఆసుపత్రిలో నన్ను కలిసే అవకాశం లభించే వరకు నా దీక్షను కొనసాగించాలని నిర్ణయించుకున్నాను,” అని వాంగ్‌చుక్ ఆ లేఖలో పేర్కొన్నారు.

జూన్ 28వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆయన ఈ దీక్ష ప్రారంభించారు. అయితే ఢిల్లీ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో జంతర్ మంతర్ వద్ద ఆయన చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అనంతరం ఆయన్ని సఫ్దర్ జంగ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా ఆయన తన దీక్షను కొనసాగించారు. కాక్రోచ్ పార్టీ జులై 20వ తేదీన చేపట్టిన చలో పార్లమెంట్ యాత్రకు కూడా ఆయన మద్దతు ప్రకటించిన విషయం విదితమే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -