Tuesday, July 21, 2026
E-PAPER
Homeక్రైమ్సర్ వైస్రాయ్ స్కూల్ సిబ్బంది నిర్లక్ష్యం

సర్ వైస్రాయ్ స్కూల్ సిబ్బంది నిర్లక్ష్యం

- Advertisement -

విద్యార్థి వేలుకు గాయం

నవతెలంగాణ పుల్కల్
మండల కేంద్రంలో ఉన్న సర్ వైస్రాయ్ ప్రైవేట్ పాఠశాల నిర్లక్ష్యంతో పాఠశాలలో ఓ చిన్నారి వేలు విరిగి చితికిపోయింది. ముద్దాయిపేట గ్రామానికి చెందిన శరత్…సర్ వైస్రాయ్ పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్నాడు. సోమవారం పాఠశాలలో విద్యార్థి వేలు విరిగి చితికి పోయిందని తల్లిదండ్రులకు సమాచారం వచ్చింది. విద్యార్థి తల్లిదండ్రులు హుటాహుటిన పాఠశాలకు చేరుకున్నారు. విద్యార్థి వేలు చూసి తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. పాఠశాల యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముక్కు పిండి ఫీజులు వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ విద్యార్థుల రక్షణపై లేదంటూ మండిపడ్డారు.

స్థానిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించిన డాక్టర్లు.. వెంటనే పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. విద్యార్థి తల్లిదండ్రులు కన్నీటి పర్యావంతం అవుతూ తమ పిల్లవాడిని సంగారెడ్డిలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో విద్యార్థి వేలు తరగతి గది తలుపులు ఇరుక్కుని గాయపడిందని పాఠశాల యజమాన్యం చేతులు దులుపుకునేందుకు ప్రయత్నించగా.. పాఠశాల యాజమాన్యం మాటపై తమకు నమ్మకం లేదని పలువురు పేర్కొన్నారు. ఉపాధ్యాయులే విద్యార్థిని కొట్టి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల యాజమాన్యం తమపై మాట రాకుండా తప్పుడు మాటలతో బుకాయిస్తున్నారంటూ ఆరోపించారు.

ఈ క్రమంలోనే అక్కడకు చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చిన్నారులను చూడడానికి పాఠశాలల్లో తగిన సంఖ్యలో ఆయాలను నియమించకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పాఠశాల సింగురు సంగారెడ్డి ప్రధాన రహదారికి అనుకొని ఉందని, అయినప్పటికీ కనీస జాగ్రత్త చర్యలు పాటించడం లేదని మండిపడ్డారు. సర్ వైస్రాయ్ పాఠశాల పూర్తిగా విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ఫీజులను దోచుకోవడం పైనే శ్రద్ధ పెట్టిందని, విద్యార్థుల పురోగతిపై కానీ, వారి రక్షణ పై కానీ ఎటువంటి శ్రద్ధ లేదని ఆరోపించారు. జిల్లా విద్యాధికారి వెంటనే స్పందించి పాఠశాలలో తనిఖీలు నిర్వహించి, పాఠశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -