సొంతగుటికి యువజన నాయకుడు మల్లేష్ గౌడ్ 

నవతెలంగాణ – రామగిరి

రామగిరి మండలం కల్వచర్ల  గ్రామానికి చెందిన టిఆర్ఎస్ గ్రామ యువజన అధ్యక్షుడు గొట్టేముక్కల మల్లేష్ గౌడ్, కల్వచర్ల ఎంపిటిసి కొట్టే సందీప్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు  మంథనిలో మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎంతో చురుగ్గా పనిచేసి కొన్ని అనివార్య కారణాల వల్ల బి ఆర్ ఎస్ లోకి వెళ్లి శనివారం తిరిగి సొంత గూటికి  చేరుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. మంత్రి వర్యులు శ్రీధర్ బాబు, శ్రీ పాద ట్రస్ట్ చైర్మన్ శ్రీను బాబు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. ఇందుకు సహకరించిన మాజీ జెడ్పిటిసి గంట వెంకట రమణారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు కొలిపాక సారయ్య, సీనియర్ నాయకులు వీరబోయిన రాజమౌళి  అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

Spread the love