యువత చదువుల్లో ఉన్నత శిఖరాలను అవరోధించాలి: ఎస్పీ

– 60 మంది యువతకు ఉచితంగా స్టడీ మెటీరియల్స్ అందజేత
నవతెలంగాణ – మల్హర్ రావు
యువత ఆటలతోపాటు చదువుల్లో ఉన్నత శిఖరాలను అవరోధించాలని భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖారే ఆకాంక్షించారు. గురువారం కాటారం మండల కేంద్రంలోని బిఎల్ఎన్ గార్డెన్ లో భూపాలపల్లి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు హాజరైయ్యే అభ్యర్థులకు స్టడీ మెటీరియల్స్  ట్రస్మ కాటారం సహకారంతో ఉచితంగా అందజేసే కార్యక్రమాన్నీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ ముఖ్యఅదితిగా హాజరై పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న 60 మంది యువకులకు ఉచితంగా స్టడీ మెటీరియల్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. విద్యార్థులు, యువత బంగారు భవిష్యత్తు కోసం అక్షరం అనే ఆయుధాన్ని వాడుకొని గొప్ప ప్రయోజకులై ఈ ప్రాంతానికి మంచిపేరు, ప్రతిష్టలు తీసుకరావాలని పిలుపునిచ్చారు. చెడు వ్యసనాలకు అలవాటు పడి భవిష్యత్ ను నాశనం చేసుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో కాటారం డీఎస్పీ, జి.రామ్మోహన్ రెడ్డి, కాటారం సీఐ నాగార్జున రావు, మహాదేవపూర్ సీఐ, కాటారం ఎస్ఐ పాల్గొన్నారు.
Spread the love