*రికార్డులను తనిఖీ చేసిన ఎస్పీ, పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలి
నవతెలంగాణ గాంధారి
కామారెడ్డి జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రాజేష్ చంద్ర గాంధారి పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గాంధారి మండల కేంద్రంలో ని పోలీస్ స్టేషన్ ను బుధవారం ఉదయం జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సందర్శించరు పోలీస్ స్టేషన్ లో ఎస్పీకి ఎస్సై ఆంజనేయులు, పోలీస్ సిబ్బంది గౌరవ వందనం చేశారు. ఎస్పీ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలని అన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసులు, సదాశివ నగర్ సిఐ సంతోష్ గాంధారి ఎస్సై ఆంజనేయులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.