ప్రజావాణి పై ప్రత్యేక దృష్టి..

– మండల, జిల్లా స్థాయిలో అధికారులు ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి..
– వారంలో రెండుసార్లు ప్రజావాణి దరఖాస్తుల పై సమీక్ష..జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
నవతెలంగాణ-సూర్యాపేట కలెక్టరేట్
ప్రజావాణిలో ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ జిల్లా అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సి.హెచ్. ప్రియాంక, బి.ఎస్. లతలతో కలసి పాల్గొని అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికలు పూర్తయినందున అధికారులు ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని, అర్జీదారుల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే పరిష్కరించే విధంగా చూడాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. అర్జీదారులు వివిధ సమస్యలపై ప్రజావాణిలో అందచేసిన దరఖాస్తులపై వారంలో రెండుసార్లు ఆయా శాఖ అధికారులతో  సమీక్షలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు.  ప్రజావాణిలో ఆయా మండలాల్లో మండల స్థాయి  అధికారులు వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ తెలిపారు.ప్రజావాణిలో  రెవెన్యూ శాఖకు సబంధించి 68, డి.ఆర్.డి.ఓ  07, డి.పి.ఓ 6 అలాగే ఇతర శాఖలకు సంబంధించిన దరఖాస్తులు 27 మొత్తం దరఖాస్తులు 108 అందాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో పి.డి. మధుసూదన్ రాజు,డి.ఎఫ్.ఓ సతీష్ కుమార్,   డి.ఈ. ఓ అశోక్, సి.పి.ఓ కిషన్, డి.ఎస్.ఓ మోహన్ బాబు, డి.ఎం.ఓ శర్మ, ఇంజనీరింగ్ అధికారులు, అర్జీదారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love