స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో ప్రత్యేక సాధారణ సమావేశం

నవతెలంగాణ –  కంటేశ్వర్
నగరంలో మారుతి నగర్ లోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక సాధారణ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్నేహ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ మహిపాల్ హాజరై ప్రసంగించారు. స్నేహ సొసైటీ నిర్వహిస్తున్న కార్యక్రమాలు రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందాయని తెలిపారు. దానికి ప్రధాన కారణం స్నేహ సొసైటీ సిబ్బంది అంకితభావంతో పనిచేయడం అని తెలిపారు. ప్రధానంగా దివ్యాంగుల సంక్షేమం, హెచ్ఐవి నివారణ హింస గురైన మహిళల సంక్షేమం లాంటి అంశాలలో స్నేహ సొసైటీ అందిస్తున్న సేవలు సమాజానికి చాలా ప్రయోజనకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఏ సంస్థ అయినా విజయవంతంగా నిర్వహించబడుతుంది అంటే ఆర్థిక వనరులు పుష్కలంగా ఉండాలని కాబట్టి అందరం స్నేహ సొసైటీ  కార్యక్రమాలకు సహాయం అందించాలని అన్నారు. స్నేహ సొసైటీ మేనేజ్ మెంట్ కమిటీకి కొత్తగా వచ్చిన సభ్యులకు అభినందనలు తెలిపారు. అదేవిధంగా దీర్ఘకాలికంగా కోశాధికారిగా పనిచేసి తీవ్ర  అస్వస్థతకు గురైన గంగాధర్ కు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. రాబోయే ఏప్రిల్ మాసంలో స్నేహ సొసైటీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం స్నేహ సొసైటీ  2024
కాలమానిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంద విద్యార్థులు శకుంతల వికాస్ పాడిన గానం అలరించింది.  స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ సిబ్బంది కార్యవర్గ సభ్యులు స్నేహ సొసైటీ ప్రధాన కార్యదర్శి ఎస్. సిద్దయ్య ఇటీవల డాక్టరేట్ పొందిన  సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ ఉపాధ్యక్షురాలు డాక్టర్ సవితరాణి, కార్యదర్శి ఎస్ సిద్దయ్య, సంయుక్త కార్యదర్శి సేర్ల దయానంద్ కోశాధికారి శివ ప్రసన్న, కార్యవర్గ సభ్యులు తాటి వీరేశం, సుధాకర్,  రమణారెడ్డి , మాజీ కార్యవర్గ సభ్యులు సోమేశ్వర్లు ,ప్రిన్సిపాల్ యస్.జ్యోతి, వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వరి, ఉమ,  మానసిక పాఠశాల సిబ్బంది అందుల పాఠశాల సిబ్బంది స్నేహ టి ఐ సిబ్బంది మంచిర్యాల సిబ్బంది సిబ్బంది, దివ్యాంగుల పాఠశాల సిబ్బంది సఖి కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love