ప్రజా పాలన దరఖాస్తులలో మార్పుపై గ్రామ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం

నవతెలంగాణ రెంజల్: ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారెంటీ పథకాలకు దరఖాస్తులు చేసుకున్న వాటిలో కొన్ని మార్పులు చేయాలన్న ప్రభుత్వ ఉత్తర్వులతో గురువారం కార్యదర్శులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో శంకర్ తెలిపారు. గృహ జ్యోతి పథకానికి సంబంధించి వినియోగదారుల గ్యాస్ కనెక్షన్ నెంబర్లు తప్పులు లేకుండా సరిచేయాలన్నారు. వారి మీటర్ల వద్ద కుటుంబ యజమాని ఆధార్ కార్డు, రేషన్ కార్డు , ఫోన్ నెంబర్లను రాసిపెట్టి ఉంచాలని, ప్రతి గ్రామంలో ఇంటింటికి తిరిగి గ్యాస్ కనెక్షన్ నెంబర్లను సరిచేయాలని రామ కార్యదర్శులకు సూచించారు. వినియోగదారుల దరఖాస్తు ఫారాలలో ఎలాంటి తప్పులు లేకుండా సరిచేయాలని వారు పేర్కొన్నారు. ఆయన వెంట ఎంపీ గౌస్ మొయినుద్దీన్, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు.

Spread the love