నకిరేకల్ ఆర్యవైశ్య సంఘము ఆధ్వర్యంలో జరిగిన వాసవి మాత గుడిలో వాసవి మాత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం లో నల్గొండ జిల్లా ఆర్యవైశ్య సంఘము అధ్యక్షులు తేలుకుంట్ల చంద్రశేఖర్, రాజకుమారి దంపతులు పాల్గొని బుధవారం ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్య కుల దేవత వాసవి మాత అనుగ్రహం ఆర్యవైశ్యులు అందరికి కలగాలని, ప్రతి ఒక్క రు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ దేవాలయం కోసం కిలో వెండి ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో చండూర్ వాసవి మాత గుడి చైర్మన్ తేలుకుంట్ల జానయ్య, మైక్రాన్ సర్ఫ్ కంపెనీ డీలర్ పోలా శ్రీనివాస్, తేలుకుంట్ల రాజకుమారి, తేలుకుంట్ల కృష్ణ లీల,జిల్లా మాజీ అధ్యక్షులు వనమా వెంకటేశ్వర్లు జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మి శెట్టి శ్రీనివాస్,నకిరేకల్ పట్టణ వైశ్య సంఘము అధ్యక్షులు వీర్ల పాటి నర్సింహా రావు, మండల వైశ్య సంఘము అధ్యక్షులు బ్రహదేవర రామ్మోహన్, గర్రె వెంకన్న, బ్రహదేవర పద్మ, వైశ్య ప్రముఖులు పాల్గొన్నారు.