
– రిజర్వేషన్లపై సంధిగ్ధం
నవతెలంగాణ – మల్హర్ రావు
స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత సర్పంచ్ ల పదవీకాలం ఫిబ్రవరి1తో ముగియనుంది. ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఆమోదం తెలుపలేదు. దీంతో ఎన్నికలు నిర్దేశిత గడువులోపు జరగవని,ప్రత్యేక అధికారుల పాలన తప్పనిసరిని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ప్రత్యేక అధికారుల నియామకానికి సంబంధించిన కసరత్తు పూర్తి చేసేందుకు అవసరమైన ఏర్పాట్లలో అధికారులు నిమజ్జమైయ్యారు.ఇందులో భాగంగా మండలస్తాయి అధికారులు సమాచారం సేకరిస్తున్నారు.
పర్సన్ ఇంచార్జిలకు అవకాశం లేని కొత్త చట్టం..నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం నిర్దేశిత గడువులోపు ఎన్నికలు నిర్వహించాలసిందే. లేదంటే ప్రత్యేక అధికారులను నియమించి పల్లె పాలనను కొనసాగించాల్సి ఉంటుంది. పదవీకాలం పూర్తియిన తదనంతరం ఆయా పాలక వర్గాలను పర్సన్ ఇంఛార్జీలుగా కొనసాగించేందుకు కొత్త చట్టం అనుమతించడం లేదు.అలా వారిని నియమించాలంటే అసెంబ్లీలో చట్ట సవరణ లేదా ఆర్డినెన్స్ ను తేవాల్సి ఉంటుంది.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలనకే మొగ్గుచూపుతున్నట్లుగా తెలుస్తోంది.
రిజర్వేషన్లపై సందిగ్ధం..పదేళ్ళపాటు రిజర్వేషన్లు ఉండేలా నూతన పంచాయతీరాజ్ చట్టంలో పొందపర్చారు. 2018లో ఎన్నికలు నిర్వహించిన సమయంలో నిర్దేశించిన రిజర్వేషన్లు పదేళ్ళపాటు అమలులో ఉంటాయని వెల్లడించారు. ప్రస్తుత ప్రభుత్వం బిసి రిజర్వేషన్లు పెంచుతామని ఎన్నికల హామిలో ప్రకటించింది. బీసీ గణన చేపట్టి ఆయా గణాంకాల ఆధారంగా రిజర్వేషన్లు నిర్దారిస్తామని వెల్లడించింది. పంచాయతీల సంఖ్య పెరిగిన నేపథ్యంలో రిజర్వేషన్ల మార్పు తప్పనిసరిగా కనిపిస్తోంది .ఈ విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అప్పటి వరకు సందిగ్ధత కొనసాగుతోంది.
మండలస్థాయి అధికారులతో..గ్రామపంచాయతీలకు మండలస్థాయి అధికారులను నియమించునట్లుగా సమాచారం. లోకసభ ఎన్నికల గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణలో భాగస్వామ్యం లేని శాఖలకు చెందిన అధికారులను ప్రత్యేక అధికారులను నియమించాలనే ఆలోచనలో జిల్లా యంత్రాంగం ఉన్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా మండల పరిషత్ లోని సూపర్ డెంట్,ఎంపిఓ,వ్యవసాయ అధికారులు,పశువైద్య అధికారులు,ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన ఏఈలను నియమించనున్నారు. మేజర్ పంచాయతీలకు జిల్లా స్థాయి అధికారులను నియమించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
సార్వత్రిక ఎన్నికల తర్వాతే పల్లెపోరు..తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం లోకసభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేస్తుంది. మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంది. ఆరు గ్యారెంటీల అమలుకు దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే.త్వరలో ఇంటింటా సర్వేలు చేపట్టి ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా,దరఖాస్తుల ఆధారంగా అర్హులను ఎపిక ఎంపిక చేయునట్లుగా సమాచారం. లబ్ధిదారుల ఎపిక ప్రక్రియ మే నెల ఆఖరులోగా పూర్తి చేసిన తర్వాతే జూన్ లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది.పంచాయతీ, ఎంపిటీసి,జెడ్పిటిసి ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించెందుకు కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం.