
పి సి పి ఎన్ డి టి టాస్క్ ఫోర్స్ బృందo ప్రత్యేక తనిఖీల్లో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మెడికవర్, మనోరమ ఆసుపత్రులను ఆరుగురు సభ్యులతో కూడిన బృందం తనిఖీ చేసినట్లు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ గురువారం తెలియజేశారు. జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ డిఎంహెచ్ఓ వద్ద నమోదు చేయించుకున్న స్కానింగ్ మిషన్లను రిజిస్టర్ అయిన డాక్టర్స్ మాత్రమే స్కానింగ్ చేయాలి. ఒకవేళ ఏదైనా మార్పులు స్కానింగ్ మిషన్లలో కానీ, డాక్టర్ లలో కానీ ఉంటే అనుమతి లేకుండా స్కానింగ్ చేయరాదు. అదేవిధంగా డాక్టర్ రిఫరల్ స్లిప్ ఇచ్చిన తర్వాతనే స్కానింగ్ చేయాలి ఫామ్ ఏఫ్ లో గర్భిణీ స్త్రీ యొక్క అనుమతి, వైద్యుని యొక్క సంతకం, గర్భిణీ స్త్రీ గుర్తింపు కార్డు ఉండాలి, స్కానింగ్ రిపోర్టును జతపరచాలి. ప్రతి స్కానింగ్ కేంద్రంలో ప్రతిరోజు స్కానింగ్ రిపోర్ట్స్ ను ఫార్మ్ ను ఆన్లైన్లో ఎంట్రీ చేస్తూ ప్రతినెల రిపోర్ట్స్ ను సబ్మిట్ చేయాలి. రికార్డ్స్ ను మెయింటైన్ చేస్తూ రెండు సంవత్సరాల వరకు భద్రపరచవలెను. ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్ కమిటీలో ఆరుగురు సభ్యులు ప్రోగ్రాం ఆఫీసర్ ఎం సి హెచ్/డిప్యూటీ డిఎంహెచ్వో,గైనకాలజిస్ట్, మహిళా తహసిల్దార్, మహిళా పోలీస్ ఆఫీసర్, సఖి కన్సల్టెంట్ ఉన్నారు.డాటా ఎంట్రీ ఆపరేటర్ఈ ఆరుగురు సభ్యుల బృందం జిల్లా కేంద్రంలోని మెడికవర్ మనోమ ఆసుపత్రులను తనిఖీ చేస్తున్న సమయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ పర్యవేక్షించినట్లు తెలియజేశారు. ఈ తనికి బృందం జిల్లా వ్యాప్తంగా ఉన్న స్కానింగ్ సెంటర్ లను ఆకస్మికంగా ఎప్పుడైనా తనిఖీ చేయడం జరుగుతుందని తెలియజేశారు.