మునుగోడు నియోజకవర్గం ఓటరు మహాశయులకు ప్రత్యేక ధన్యవాదాలు

– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం
నవతెలంగాణ-చండూరు : 2024  సార్వత్రిక ఎన్నికలలో  సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓటు వేసి, ఆశీర్వదించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు.. బుధవారం చండూరులో ఏర్పాటుచేసిన సమావేశంలో  ఆయన మాట్లాడుతూ, నామినేషన్ నుండి ఇప్పటివరకు అహర్నిశలు పనిచేసిన పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఓటర్ మహాశయులకు ప్రజలకు కార్మికులకు పత్రిక విలేకరులకు,వ్యాపారస్తులకు,ఉద్యోగస్తులకు,విద్యార్థి,మేధావులకు,కవులు,కళాకారులకు, ఎలక్షన్ లో పాల్గొన్న సిబ్బందికి అందరికీప్రత్యేక ధన్యవాదాలు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) చండూరు మండల కార్యదర్శి మొగుదాల వెంకటేశం, చండూరు మండల సహాయ కార్యదర్శిజెర్రీపోతుల ధనంజయ గౌడ్, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులుచిట్టిమల్ల లింగయ్య, రవి, గౌసియా బేగం, కొత్తపల్లి నరసింహ, వెంకన్న, స్వామితదితరులు పాల్గొన్నారు.
Spread the love